- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Khan: తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన సల్మాన్ ఖాన్.. గ్రేట్ అంటున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan).. మరోసారి తన గొప్ప మనసు చాటుకుని నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan).. మరోసారి తన గొప్ప మనసు చాటుకుని నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నారు. బీయింగ్ హ్యూమన్ (Being Human) అనే ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ఆరోగ్య సంరక్షణ అండ్ ప్రాథమిక విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇదే ఫౌండేషన్ (Foundation) ద్వారా అన్ని వయసుల వారికి ఉచిత తనిఖీలు, కంటి చుక్కలు, కళ్ళద్దాలు అండ్ చికిత్సను అందించాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను @Siddharth R Kannam షేర్ చేస్తూ.. ‘తన తండ్రి సలీం ఖాన్ (Salim Khan) వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న సల్మాన్ ఖాన్‌ను చూస్తుంటే.. నిజంగా నా హృదయం ఉప్పొంగుతోంది. పరిమిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో బీయింగ్ హ్యూమన్ ద్వారా ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. అన్ని వయసుల వారికి తెరిచిన ఈ శిబిరం ఉచిత తనిఖీలు, కంటి చుక్కలు, కళ్ళద్దాలు అండ్ చికిత్సను అందించింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తెచ్చింది’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతుండగా.. గ్రేట్ హ్యూమన్ (Great Human) అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. సల్మాన్ ఖాన్ త్వరలో ‘సికందర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
Read More..
‘ఫుడ్ కోమాతో పగటి కలలు కంటున్నాను’.. విజయ్ దేవరకొండ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్






