ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వర్షం ఆగిన ఆ ఒక్క గంట అంటూ..

by I. Sairam |

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వర్షం ఆగిన ఆ ఒక్క గంట అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ స్టైలీష్ వేర్‌లో దర్శనమిచ్చింది. అంతేకాకుండా తన కొంటె చూపుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది. ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘వర్షం ఆగిన ఆ ఒక్క గంట’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు గ్లామరస్ క్వీన్, సూపర్, సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story