Pragya Jaiswal: నీలం రంగు బికినీలో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-03-22 12:43:22  IST  )

ప్రగ్యా జైస్వాల్ హాట్ పిక్స్ వైరల్.. స్విమ్మింగ్ పూల్‌లో అందాల సందడి

Pragya Jaiswal: నీలం రంగు బికినీలో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ కెరియర్ ప్రారంభంలో కొంతమేర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈమె మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఆ తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు కంచె సినిమాలో అవకాశం దక్కింది.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు, ఇందులోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. దాంతో ఒక్కసారిగా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల కంటే గ్లామర్ రోల్స్ ఎక్కువగా దక్కాయి.

తన కెరియర్‌లో బాలకృష్ణ సరసన నటించిన అఖండ , డాకు మహారాజ్ చిత్రాలు మినహాయిస్తే పెద్దగా విజయాలు దక్కలేదని చెప్పాలి. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం అందాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రగ్యా జైస్వాల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తరచూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలలో స్విమ్మింగ్ పూల్‌లో నీలం రంగు బికినీ ధరించి మెట్లు ఎక్కుతూ, దిగుతూ, సైడ్ యాంగిల్‌లో చిరునవ్వుతో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఆమె అందాలు చాలా బాగా హైలైట్ కావడంతో ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Next Story