Pragya Jaiswal: ‘ప్రేమతో నిండిన పగలు, మాయాజాలంతో నిండిన రాత్రులు’ అంటూ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-03-11 16:50:56  IST  )

విరాట్టు అనే తమిళ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా అక్కర్లేదు.

Pragya Jaiswal: ‘ప్రేమతో నిండిన పగలు, మాయాజాలంతో నిండిన రాత్రులు’ అంటూ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్టు అనే తమిళ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా అక్కర్లేదు. అలాగే తెలుగులో ఈమె నటించిన మొదటి చిత్రం కంచె చిత్రానికి ఉత్తమ నటిగా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు (South Filmfare Award)సొంతం చేసుకుంది. అలాగే టిటూ ఎంబీఏ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

అలాగే ఆచారి అమెరికా యాత్రం, నక్షత్రం, అఖండ (Akhaṇḍa), మిర్చి లాంటి కుర్రాడు, ఓం నమో వేంకటేశాయ (Om Namo Venkatesaya), జయ జానకి నాయక, గుంటూరోడు, భారత పుత్రుడు, ఖేల్ ఖేల్ మహారాజ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించి ప్రగ్యా జైస్వాల్. కంచె సినిమాలో అద్భుతమైన నటనకు ఈ బ్యూటీకి 63 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది.

అలాగే అఖండ సినిమాకు కూడా 10 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా ఉత్తమ నటిగా లభించింది. ఒకవేళ సినిమా అవకాశాలు రాకపోయినా.. ఈ బ్యూటీ తెలివిగా డబ్బు సంపాదించుకుంటోంది. సినిమాల్లోనే మాత్రమే కాకుండా.. మోడల్‌గా పలు బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా కూడా వ్యవహరించింది.

అంతేకాకుండా యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన గురించి.. ప్రగ్యా వంటకాల గురించి అనే విషయాల షేర్ చేసుకుంటుంది. ఇలా సంవత్సరానికి ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియా టాక్.

అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ప్రగ్యా ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను తన అభిమానులతో పంచుకుంది. ‘‘ప్రేమతో నిండిన పగలు, మాయాజాలంతో నిండిన రాత్రులు.. ఇప్పటివరకు జరిగిన అత్యంత ఆహ్లాదకరమైన వివాహాలలో ఇది ఒకటి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story