Pragya Jaiswal: డిఫరెంట్ క్యాప్షన్ జోడించి ఆకట్టుకుంటోన్న ఫొటోలు పంచుకున్న హీరోయిన్

by Kodari Anjali |

విరాట్టు అనే తమిళ్ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Pragya Jaiswal: డిఫరెంట్ క్యాప్షన్ జోడించి ఆకట్టుకుంటోన్న ఫొటోలు పంచుకున్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్టు అనే తమిళ్ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలాగే తెలుగులో ఈమె నటించిన మొదటి చిత్రం కంచె చిత్రానికి ఉత్తమ నటిగా సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే టిటూ ఎంబీఏ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అలాగే ఆచారి అమెరికా యాత్రం, నక్షత్రం, అఖండ, మిర్చి లాంటి కుర్రాడు, ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, జయ జానకి నాయక, భారత పుత్రుడు, ఖేల్ ఖేల్ మహారాజ్, వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకుల్ని అలరించే పనిలో బిజీగా ఉంది.

కంచె సినిమాలో అద్భుతమైన నటనకు ఈ బ్యూటీకి 63 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ సౌత్ లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. అలాగే అఖండ సినిమాకు కూడా 10 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా ఉత్తమ నటిగా లభించింది.

ఒకవేళ సినిమా అవకాశాలు రాకపోయినా.. ఈ బ్యూటీ తెలివిగా డబ్బు సంపాదించుకుంటోంది. సినిమాల్లోనే మాత్రమే కాకుండా.. మోడల్‌గా పలు బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా కూడా వ్యవహరించింది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన గురించి.. ప్రగ్యా వంటకాల గురించి అనే విషయాలు షేర్ చేసుకుంటుంది. ఇలా సంవత్సరానికి ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియా టాక్.

ఇకపోతే ఈ బ్యూటీ తరచూ డిఫరెంట్ డిఫరెంట్ ఫొటో షూట్లతో అభిమానులను అరిస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రగ్యా జైస్వాల్ ‘‘సూర్యరశ్మి మానసిక స్థితి’’ అని క్యాప్షన్ జోడించి అదిరిపోయే ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ వేదికన పంచుకుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే యల్లో కలర్ శారీ కట్టుకుని.. నడుము అందాలతో ఈ ముద్దుగుమ్మ ఖతర్నాక్ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story