Pragathi: నటి ప్రగతి ఉడుంపట్టు.. ఈ సారి గోల్డ్ మెడల్ కూడా !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి ప్రగతి ( Pragathi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో హీరోయిన్ల తల్లిగా, లేదా బ్రహ

Pragathi: నటి ప్రగతి ఉడుంపట్టు.. ఈ సారి గోల్డ్ మెడల్ కూడా !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి ప్రగతి ( Pragathi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో హీరోయిన్ల తల్లిగా, లేదా బ్రహ్మానందం భార్యగా.. ఇలా ఎన్నో పాత్రలలో కనిపించింది నటి ప్రగతి. అయితే సినిమాల్లోనే కాకుండా తన ఫిట్నెస్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు నటి ప్రగతి. నిత్యం జిమ్ లో కష్టపడుతూ.. చాలా వీడియోలే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే జిమ్ చేయడమే కాకుండా... తనకంటూ ఒక గుర్తింపు రావాలని వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో కూడా తరచూ పాల్గొంటారు. ఇటీవల సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో వెండి పతకాన్ని సాధించిన ఈ నటి ప్రగతి.... ఇప్పుడు మరోసారి మూడు మెడల్స్ సంపాదించింది. నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 ( National Masters Classic Powerlifting Championship) టోర్నమెంట్ కేరళలో జరిగింది.

అయితే ఈ ఈవెంట్ లో.. గోల్డ్ మెడల్ తో పాటు మరో రెండు మెడల్స్ సంపాదించింది నటి ప్రగతి. స్క్వేట్ 115 కిలోలు, బెంజ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్టు 122.5 కిలోల పోటీల్లో పాల్గొన్నారు ప్రగతి. ఇందులో గోల్డ్ తో పాటు మరో రెండు మెడల్స్ సంపాదించారు. ఇలా మొత్తంగా మూడు మెడల్స్ సాధించినట్లు సోషల్ మీడియాలో... ఎమోషనల్ పోస్టు కూడా పెట్టారు నటి ప్రగతి.

INSTAGRAMME LINK

Next Story