- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన ప్రదీప్ రంగనాథన్
యంగ్ అండ్ డైనమిక్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LiK) ఒకటి.

దిశ, సినిమా: యంగ్ అండ్ డైనమిక్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LiK) ఒకటి. విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. SJ సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార (Nayanthara) నిర్మిస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుతున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అలాగే.. ప్రజెంట్ ప్రదీప్ వరుస హిట్స్‌తో దూసుకుపోతుండటంతో.. ఈ మూవీ బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈ యంగ్ హీరో ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ అప్‌డేట్ ప్రకటించారు చిత్ర బృందం. ఈ మేరకు ప్రదీప్ రంగనాథన్ తన సోషల్ మీడియా అకౌంట్ X (ట్విట్టర్) వేదికగా.. ఓ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది.






