ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ మూవీ ‘డ్యూడ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Chukka Sudharani |

వరుస హిట్స్‌తో సందడి చేస్తున్న ప్రదీప్ రంగనాథన్.. తాజాగా ‘డ్యూడ్’తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ మూవీ ‘డ్యూడ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: వరుస హిట్స్‌తో సందడి చేస్తున్న ప్రదీప్ రంగనాథన్.. తాజాగా ‘డ్యూడ్’తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. యాక్షన్ కామేడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించి రికార్డులను సృష్టించిన ఈ చిత్రం దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో ఆదరణ పొందింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా... నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉండగా.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా.. మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. శరత్ కుమార్, హృధు హరూన్, రోహిణి కీలక పాత్రలో కనిపించి సందడి చేశారు. Link

Next Story