చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్?

by Pulgam srinivas |

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కోమలి' చిత్రంతో కోలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 'లవ్ టుడే' సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు. అనంతరం 'డ్రాగన్', 'డ్యూడ్' చిత్రాల విజయాలతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఇటీవల విడుదలైన 'LIK' చిత్రం మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక నిరాశపరిచింది. అయినప్పటికీ ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. దీంతో టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఓ సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథాపరమైన చర్చలు జరిగినట్లు, దాదాపు ఈ క్రేజీ కాంబినేషన్ ఖరారైనట్లేనని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే, ఈ విభిన్న కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story