- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమితా బైజుతో ప్రదీప్ రంగనాథన్ మరో సినిమా.. కానీ ఈసారి హీరోగా కాదు!
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తూ హిట్స్ అందుకుంటున్న ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది.

దిశ, సినిమా: ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తూ హిట్స్ అందుకుంటున్న ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది. ‘లవ్ టుడే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడిగాను మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ స్టర్. తర్వాత మళ్లీ ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి సినిమాలతో హీరోగా తన సక్సెస్ రేట్‌ను మరింత పెంచుకున్న ఈయన.. ఇటీవల విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ‘LIK’ చేసి హిట్ అందుకోలేకపోయాడు. ఇకపోతే ఇప్పుడు ఈ హీరో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. తానే సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు టాక్.
ఈ సినిమా దర్శకుడు ఎవరు? హీరో ఎవరు? అనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. హీరోయిన్‌పై మాత్రం ఓ బజ్ వినిపిస్తుంది. డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ సరసన హీరోయిన్‌గా నటించిన మమితా బైజును తన సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశాడట ప్రదీప్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. ఇందులో ప్రదీప్ హీరోగా నటిస్తాడా? లేదా? అనేది ప్రస్తుతం సస్పెన్సింగ్‌గా మారింది.






