అప్పుడే ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ LIK.. స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అప్డేట్

by Chukka Sudharani |   (  Updated:2026-05-01 09:51:07  IST  )

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన LIK ఓటీటీ రిలీజ్‌పై అఫీషియల్ అప్డేట్ వచ్చింది.

అప్పుడే ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ LIK.. స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అప్డేట్
X

దిశ, సినిమా: యూత్ ఐకాన్ ప్రదీప్ రంగనాథన్, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘LIK’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి రిలీజ్‌కు ముందు వచ్చిన ప్రతి అప్డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక వాయిదాల తర్వాత ఏప్రిల్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చింది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ ఆధ్వర్యంలో ఘనంగా రిలీజ్ చేశారు. భారీ హైప్ మధ్య వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, నెల రోజుల్లోనే ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ‘LIK’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకోగా.. మే 6నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Next Story