- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరో పెద్ద కేడీ...బండారం బయటపెట్టిన ప్రేమలు భామ !
ప్రదీప్ రంగనాథన్ పై హీరోయిన్ మమిత బైజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చూడడానికి సైలెంట్ గా ఉన్న ప్రదీప్ రంగనాథన్

దిశ, వెబ్ డెస్క్ : ప్రదీప్ రంగనాథన్ పై హీరోయిన్ మమిత బైజు ( mamitha baiju) సంచలన వ్యాఖ్యలు చేశారు. చూడడానికి సైలెంట్ గా ఉన్న ప్రదీప్ రంగనాథన్ ( Pradeep Ranganathan ) పెద్ద కేడీ అంటూ ఆమె బాంబు పేల్చారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ డ్యూడ్ ( Dude 2025). తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగులో కూడా ప్రదీప్ రంగనాథన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు.
అలాగే ఈ సినిమాలో నేహా శెట్టి కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. డీజే టిల్లు తరహాలోనే ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు. కామెడీ అలాగే యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయట. అయితే ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రమోషన్స్ లో హీరో హీరోయిన్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మమిత బైజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో ప్రదీప్ రంగనాథన్ చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటాడని చెప్పిన ఆమె, అతడు పెద్ద కేడీ అంటూ బాంబు పేల్చింది. అలాగే అతడు భయంకరమైన వ్యక్తి అంటూ వాపోయారు. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు ఫన్నీ గానే చేసింది.






