- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేజ్ పైనే హీరోయిన్ ను గిల్లిన ప్రదీప్ రంగనాథన్..!
ప్రమోషన్స్ లో దూసుకు వెళ్తున్న ప్రదీప్ రంగనాథన్, తన సహనటి మమితా బైజు బుగ్గలు గిల్లాడు.

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ ( Pradeep Ranganathan), ప్రేమలు బ్యూటీ మమితా బైజు (Mamitha Baiju) కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ డ్యూడ్ ( Dude). ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. అంటే రిలీజ్ కు ఒకే ఒక్క రోజు ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ప్రమోషన్స్ లో దూసుకు వెళ్తున్న ప్రదీప్ రంగనాథన్, తన సహనటి మమితా బైజు బుగ్గలు గిల్లాడు.
అక్కడితో ఆగకుండా జుట్టు పట్టుకుని లాగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. స్టేజ్ పైన హీరోయిన్ మమితా బైజు మాట్లాడుతుండగా ప్రదీప్ ఇలా వ్యవహరించాడు. అయితే దీనిపైనే నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాకు హైప్ రావడానికి ఇలా బరితెగించడం అవసరమా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలు మూడు రిలీజ్ కు సిద్ధంగా ఉండగా, మధ్యలో ఈ తమిళ సినిమా అవసరమా ? అంటున్నారు. మీరు స్టేజ్ పై ఎన్ని కుప్పిగంతులు వేసినా, వర్కౌట్ కాదని కౌంటర్ ఇస్తున్నారు. అయితే, హీరోయిన్ బుగ్గ గిల్లితే తప్పేముందని మరికొందరు హీరోకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. క్లిక్






