ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు వెళ్తున్న కారు నుజ్జునుజ్జు.. యూనిట్ సభ్యుల్లో ఒకరు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 06:32:39  IST  )

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది.

ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు వెళ్తున్న కారు నుజ్జునుజ్జు.. యూనిట్ సభ్యుల్లో ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ (Fauj) షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ వెళ్తున్న యూనిట్ సభ్యుల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇవాళ ఉదయం స్టాఫ్ షూటింగ్ వెళ్తుండగా.. తూప్రాన్‌పేట్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి చేర్చారు.

యూనిట్‌లో విషాద ఛాయలు..

సినిమా షూటింగ్ ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ‘ఫౌజీ’ చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. మృతుడి కుటుంబ సభ్యులకు చిత్ర బృందం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story