ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. క్రేజీ పోస్టర్ వచ్చేసింది

by velandi.Saikiran |

ప్రభాస్ పుట్టిన రోజు ఈ నెల 22వ తేదీన ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర

ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. క్రేజీ పోస్టర్ వచ్చేసింది
X

దిశ‌, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మారిపోయిన ప్రభాస్, తన ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ది రాజాసాబ్‌ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్, త్వరలోనే దర్శకుడు హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ప్రభాస్ పుట్టిన రోజు ఈ నెల 22వ తేదీన ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఒక బెటాలియన్ మీద పడిపోతే ఇలానే ఉంటుంది అంటూ ఈ పోస్టర్ పై క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈసారి పుట్టినరోజుకు దుమ్ములేపాల్సిందే అంటున్నారు.




Next Story