Prabhas: ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. అఫీషియల్ పోస్టర్ వైరల్

by Chukka Sudharani |

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రాల్లో ‘వర్షం’ (Varsham) ఒకటి.

Prabhas: ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. అఫీషియల్ పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రాల్లో ‘వర్షం’ (Varsham) ఒకటి. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌నే ఓ స్థాయిలో నిలబెట్టింది. శోభన్ (Shobhan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటించగా.. గోపీ చంద్ (Gopi Chand) విలన్ పాత్రలో మెప్పించాడు. 2004లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో 100 రోజులు థియేటర్స్‌లో ఆడి కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బిగ్‌స్క్రీన్‌పై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. 4K వెర్షన్‌(4K version)లో తెరపైకి సందడి చేసేందుకు సిద్ధమై వర్షం మూవీ మే 23న రీ రిలీజ్ (re-release) కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

కాగా.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. ‘ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్’ వంటి చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు తెలుస్తుండగా.. త్వరలో వీటి రిలీజ్‌పై కూడా అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవే కాకుండా.. సలాన్-2, కల్కి-2 సీక్వెల్స్ కూడా లైన్‌లో పెట్టాడు ప్రభాస్.

Next Story