- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్ వాయిదా.. ఆ స్పెషల్ డే నాడు తీసుకొచ్చే ప్లాన్‌లో మూవీ మేకర్స్! (ట్వీట్)
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ఇటీవల ‘కల్కి’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం కల్కి-2, సలార్-2, ఫౌజి, స్పిరిట్ వంటి మూవీస్ చేస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ఇటీవల ‘కల్కి’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం కల్కి-2, సలార్-2, ఫౌజి, స్పిరిట్ వంటి మూవీస్ చేస్తున్నారు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’ సినిమాలోనూ డార్లింగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఆయన లుక్‌పై పలు విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో పలువురు స్టార్స్ నటిస్తుండటంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీతో పాటు ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Rajasaab) లోనూ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్, మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవగా.. పలు పోస్టర్స్ విడుదలై అంచనాలను పెంచేశాయి. అయితే మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్‌ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘ది రాజాసాబ్’ మూవీ విడుదల వాయిదా పడినట్లు డేట్‌లో మార్పులు జరిగినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోవడంతోఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.
#PRABHAS - #TheRajaSaab Team Trying Hard to Release the Film on INDEPENDENCE DAY - AUG 15th 🥵🥵🥵💥💥💥
— GetsCinema (@GetsCinema) March 30, 2025
If it’s Not Release means #Prabhas Other Films gets Different Release Dates ✅
pic.twitter.com/PQzZn08Z88






