- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Rajasaab: రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. రెండు ట్రైలర్స్‌తో వచ్చేస్తున్న ప్రభాస్
డార్లిండ్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీ రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.

దిశ, సినిమా: డార్లిండ్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీ రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఎన్నోసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్‌గా డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు సిద్ధం అవ్వగా.. ఈ డేట్ కూడా మారినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. ఫైనల్‌గా ‘ది రాజాసాబ్’ రిలీజ్‌పై ఇప్పటికి క్లారిటీ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత విశ్వ ప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని వచ్చే ఏడాది పండుగ స్పెషల్‌గా జనవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అంతే కాకుండా.. ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు రెండు ట్రైలర్స్ కట్ చేశారట మేకర్స్. అక్టోబర్‌లో ట్రైలర్ 1ను రిలీజ్ చేయనుండగా.. డిసెంబర్‌లో రిలీజ్ ట్రైలర్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లింక్






