ప్రభాస్ కు షాక్.."ది రాజాసాబ్" వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే

by velandi.Saikiran |

."ది రాజాసాబ్" ఫస్ట్ వీక్ రూ.238 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ప్రభాస్ కు షాక్..ది రాజాసాబ్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన రిలీజ్ అయింది. ఈ లెక్కన ఈ సినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో వారం రోజుల కలెక్షన్స్ ప్రకటించింది చిత్ర బృందం. ఫస్ట్ వీక్ ఈ సినిమా రూ.238 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఇప్పటి వరకు ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. ముందుగా వచ్చిన ప్రభాస్ సినిమా మాత్రమే 200 కోట్లకు పైగా వసూళ్ళు చేసింది. అయితే ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోందట. దీనికి ముఖ్య కారణం ప్రభాస్ యాక్టింగ్ మాత్రమే అంటున్నారు. ప్రభాస్ సినిమాను అతి త్వరలోనే చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా దాటే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా మెరిశారు. సప్తగిరి అలాగే సత్య కామెడీ బాగుంది. హారర్ తో పాటు కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కొంతమందికి నచ్చితే.. కొంతమందికి మాత్రం నచ్చలేదు.

Next Story