ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ది రాజా సాబ్ లో కొత్త సీన్లు యాడ్ !

by velandi.Saikiran |

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌. ది రాజా సాబ్ లో కొత్త సీన్లు యాడ్ చేసినట్లు వివరించారు దర్శకుడు మారుతి.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ది రాజా సాబ్ లో కొత్త సీన్లు యాడ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ అయింది. జనవరి 8వ తేదీన ప్రీమియర్లు పడిపోయాయి. హారర్, కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ కారణంగా సినిమాకు భారీగానే కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమా ఒక్క రోజులోనే రూ.112 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్ లో గ్రాస్ వసూళ్లు రాబట్టిన హారర్ ఫాంటసీ సినిమాలలో ది రాజా సాబ్ మొదటిది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

రాజా సాబ్ సినిమాలో కొత్త సీన్లు

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ( The Rajasaab) సినిమా రెస్పాన్స్ పై తాజాగా దర్శకుడు మారుతి స్పందించారు. మూవీ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాలేదు కానీ.. కొంచెం ఫీల్ అయ్యార‌ని వెల్లడించారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్లు లేకపోవడంతో, ఫ్యాన్స్ కాస్త హార్ట్ అయ్యారని పేర్కొన్నారు. అందుకే సెకండ్ హాఫ్ ను మరింత ఎడిట్ చేసి, రూప్ ఫైట్ ఎపిసోడ్ యాడ్ చేసినట్లు వివరించారు. ఇది అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా యాడ్ చేసినట్లు తెలిపారు. ఈ సీన్లు ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

Next Story