- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ది రాజా సాబ్ నుంచి స్పెషల్ పోస్టర్
ది రాజాసాబ్ ( The Raja Saab) సినిమా నుంచి ప్రభాస్ ( Prabhas) సూపర్ లుక్ రిలీజ్ చేసింది చిత్రం బృందం

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ది రాజాసాబ్ ( The Raja Saab) సినిమా నుంచి ప్రభాస్ ( Prabhas) సూపర్ లుక్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. చిత్ర పరిశ్రమలో ప్రభాస్ 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం.
ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. రజినీకాంత్ తరహాలో నోట్లో చుట్ట పెట్టుకొని చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఇక ప్రభాస్ వెనకాల ఓ గ్యాంగ్ కూడా కనిపిస్తోంది. ఆ బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే, సాంగ్ లో ఓ షాట్ కు సంబంధించిన పోస్టర్ గా అంచనా వేయవచ్చు. ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన ఈ రాజా సాబ్ సినిమాను మారుతి గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. సంక్రాంతి కానుకగా అంటే జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.






