ప్రభాస్ జోకర్ లుక్.. ఆ నటుడికి కౌంటర్ అదుర్స్?

by velandi.Saikiran |

2024 లో రిలీజ్ అయిన కల్కి సినిమాలో హీరో జోకర్ లాగా ఉన్నాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అప్పట్లో కామెంట్ చేసిన

ప్రభాస్ జోకర్ లుక్.. ఆ నటుడికి కౌంటర్ అదుర్స్?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రభాస్, ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో, వరుసగా ఈ మూవీ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.

అయితే ఈ రెండో ట్రైలర్ లో చివరన హీరో ప్రభాస్ జోకర్ గెటప్ లో కనిపిస్తాడు. ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2024 లో రిలీజ్ అయిన కల్కి సినిమాలో హీరో జోకర్ లాగా ఉన్నాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అప్పట్లో కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది ప్రభాస్ లుక్ ను అప్పట్లో ట్రోలింగ్ కూడా చేశారు. కానీ దానిపై ప్రభాస్ స్పందించలేదు. అయితే ఇప్పుడు ట్రైలర్ లో మాత్రం జోకర్ లాగా కనిపించి, ఆ బాలీవుడ్ నటుడుకి ప్రభాస్ కౌంటర్ ఇచ్చాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story