- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'విక్రమార్కుడు'లో ఆ సన్నివేశం చాలా డేంజర్.. దెబ్బకు జ్వరం వచ్చింది.. ప్రభాస్ శ్రీను
ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ... విక్రమార్కుడులో ఓ సన్నివేశంలో మమ్మల్ని నిజంగానే రవితేజ కొట్టాడు. ఆ దెబ్బకి కన్నన్ అనే రైటర్ కి జ్వరం కూడా వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్లో బిజీయెస్ట్ నటులలో ఒకరైన ప్రభాస్ శ్రీను గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ నటుడికి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈయన కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. ఈ కమెడియన్ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు స్నేహితుడు. ప్రభాస్ నటించిన సినిమాల్లో కూడా ఈయన నటించాడు.
తాజాగా ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా విక్రమార్కుడు సినిమాలోని ఓ సన్నివేశం గురించి చెప్పుకొచ్చాడు. విక్రమార్కుడు మూవీలో రవితేజ గారు స్టేషన్ నుండి బయటకు వచ్చే సన్నివేశంలో మేము ఆయన్ను కామెంట్ చేస్తాం. దాంతో ఆయన నాతోపాటు ఉన్న కొంతమందిని కొడతాడు. ఇక ఆ సన్నివేశంలో కనీసం సేఫ్టీ ప్యాడ్ కూడా లేకుండా మా వెనక ఆయన కర్రతో కొట్టాడు. ఆయన సేఫ్టీ ప్యాడ్ లేకపోయినా గట్టిగానే కొట్టారు. దానితో మాకు బాగా నొప్పి వేసింది.
ఆ సన్నివేశాన్ని దాదాపు నాలుగు రోజులపాటు చిత్రీకరించారు. ఇక కన్నన్ అనే రైటర్‌కు ఏకంగా ఆ దెబ్బల వల్ల జ్వరం కూడా వచ్చింది అని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. ఇక రవితేజ గురించి ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ... ఆయన చాలా మంచి మనిషి, సరదాగా ఉంటారు. ఆయనకు పొగడ్తలు అంటే అస్సలు నచ్చవు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఆయన ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చాడు. రవితేజ హీరోగా రూపొందిన విక్రమార్కుడు సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించగా రాజమౌళి దర్శకత్వం వహించాడు.






