డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్‌పై అప్డేట్

by Chukka Sudharani |

‘స్పిరిట్’ టీమ్ ప్రజెంట్ గోవాలో చిత్రీకరణ జరుపుకుంటున్నారు.

డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్‌పై అప్డేట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తోన్న స్పిరిట్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ కనిపించబోతున్నాడని ఇటీవల డైరెక్టర్ సందీప్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ‘ప్రస్తుతం గోవాలో వివేక్ ఒబెరాయ్ అండ్ మరికొందరితో 'స్పిరిట్' షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ త్వరలోనే చేరనున్నారు’ అని ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రకాష్ రాజ్, సీనియర్ నటి కాంచన తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్ భాషలతో పాటు మరిన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story