- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Spirit First Look: ప్రభాస్ "స్పిరిట్" ఫస్ట్ లుక్ వచ్చేసింది..సిగరేట్ కాల్చుతూ మాస్ ఎంట్రీ
"స్పిరిట్" ఫస్ట్ లుక్ వచ్చేసింది..సిగరేట్ కాల్చుతూ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా తృప్తి డిమ్రి ( Triptii Dimri) హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ మొదటిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. అయితే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి కొత్త సంవత్సరం సందర్భంగా అదిరిపోయే అప్డేట్ విడుదల చేశారు. "స్పిరిట్" ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఇక "స్పిరిట్" ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఊర మాస్ లుక్ లో కనిపించారు. గాయాలతో ఉన్న ప్రభాస్ కు హీరోయిన్ తృప్తి డిమ్రి సిగరేట్ వెలిగిస్తూ మెరిసారు. అటు, ఒళ్లంతా గాయాలు ఉన్నప్పటికీ, ప్రభాస్ మాత్రం రిలాక్స్ కనిపిస్తున్నాడు. అదే సమయంలో చేతిలో లిక్కర్ గ్లాస్ పట్టుకుని, హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇక ఈ పోస్టర్ వదలడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.






