Prabhas Sisters: ప్రభాస్ చెల్లెళ్లు ఇప్పుడెలా ఉన్నారో తెలుసా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-04 07:16:47  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Prabhas Sisters: ప్రభాస్ చెల్లెళ్లు ఇప్పుడెలా ఉన్నారో తెలుసా.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక దివంగత హీరో కృష్ణంరాజు(Krishnam Raju)కు నలుగురు కూతుళ్లు అన్న సంగతి తెలిసిందే. ఈ నలుగురికి ప్రభాస్ అన్నయ్య. వీరితో డార్లింగ్ ఎంతో సరదాగా ఉంటాడు. అందుకే అన్నయ్య అంటే చెల్లెళ్లకి కూడా ఎంతో ప్రేమ. అయితే ఈ నలుగురు చెల్లెళ్లలో ఇప్పటికే ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.

తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ప్రసీద ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో సిస్టర్స్‌తో పాటు ప్రభాస్ పెద్దమ్మ కూడా ఉన్నారు. ఇక దీనికి ‘హాఫ్ వే దేర్..2025’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story