నిధి అగర్వాల్ కు ఇష్టమైన ఫుడ్ పంపిన హీరో... ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ వీడియో!

by velandi.Saikiran |

ఆహారాన్ని ప్రభాస్ ఇంటి నుంచి పంపించారని ప్రభాస్ అలాగే ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి కృతజ్ఞతలు కూడా తెలిపారు నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ కు ఇష్టమైన ఫుడ్ పంపిన హీరో... ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ  వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయిన ఈ అందాల తార... ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో కూడా మరోసారి మెరువనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా... డిసెంబర్ లో మూవీ రిలీజ్ కానుంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో హీరో ప్రభాస్ అలాగే ఆయన పెద్దమ్మ శ్యామల దేవికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది హీరోయిన్ నిధి అగర్వాల్ ( nidhi agarwal). ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను కూడా పంచుకుంది. తాజాగా ప్రభాస్ ఇంటి నుంచి...కాకినాడలో ఉన్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు భోజనం వచ్చింది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రత్యేకంగా.. ఆహారాన్ని వండి మరీ పంపినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆ వెజిటేరియన్ ఆహారాన్ని తింటూ నిధి అగర్వాల్ వీడియో చేశారు. తనకు ఇష్టమైన వెజిటేరియన్ ఆహారాన్ని ప్రభాస్ ఇంటి నుంచి పంపించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభాస్ అలాగే ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి కృతజ్ఞతలు కూడా తెలిపారు హీరోయిన్ నిధి అగర్వాల్. చివరలో ఫ్లయింగ్ కిస్ లు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇక ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన భోజనం లో పప్పు, సాంబార్, పెరుగు, ఏపీ స్పెషల్ వంటకాలు, స్వీట్స్ ఉన్నాయి.

Twitter Link

Next Story