ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నాడు.. మంచు హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-05-28 05:15:59  IST  )

హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నాడు.. మంచు హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. 'కన్నప్ప' కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టాము. ఈ సినిమాకి ఆడియన్స్‌ను రప్పించడానికి నా ఒక్కడి బలం సరిపోదు. అందువలన స్టార్స్ సపోర్ట్ కావాలి. ఈ కారణంగానే నేను వెళ్లి ప్రభాస్‌ను కలిశాను. ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆయన ఓకే చెప్పాడు.

ఈ రోజున నేను ఈ సినిమా కోసం ఇంత మొత్తం ఖర్చు పెట్టానంటే, అందుకు కారణం ప్రభాస్ అనే చెబుతాను. ప్రభాస్‌కి పారితోషికంగా ఎంత ఇవ్వడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ పారితోషికం గురించి మాట్లాడితే చంపేస్తానని అన్నాడు. మొదటి నుంచి నాకు ప్రభాస్‌తో మంచి స్నేహం ఉంది. అయితే డార్లింగ్ ఈ సినిమా చేయడానికి కారణం మాత్రం, మా నాన్న గారిపై ఆయనకు గల అభిమానం అనే చెప్పాలి.

అడగ్గానే ప్రభాస్ ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు గురించి అడుగుతూ, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. నా రక్త సంబంధీకులే నా పతనాన్ని కోరుకుంటున్న సమయంలో, ఒక ప్రభాస్ లాంటి స్టార్ అండగా నిలబడటం విశేషం. ఈ నెల 30వ తేదీన 'భైరవం' రిలీజ్ అంటున్నారు. సినిమా ఏదైనా అందరూ పడే కష్టం ఒక్కటే. అందువలన అన్ని సినిమాలు బాగా ఆడాలనే నేను కోరుకుంటాను" అని చెప్పారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Next Story