Prabhas: రాజాసాబ్ టీజర్ రెడీ.. క‌నీసం ఓ వారం రోజులు మాట్లాడుకుంటారు అంటూ పోస్ట్

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘రాజాసాబ్’ (Rajasaab) ఒకటి.

Prabhas: రాజాసాబ్ టీజర్ రెడీ.. క‌నీసం ఓ వారం రోజులు మాట్లాడుకుంటారు అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘రాజాసాబ్’ (Rajasaab) ఒకటి. మారుతి (Maruti) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ (Romantic horror thriller) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేసినప్పటికీ అప్‌డేట్స్ మాత్రం రావడం లేదు. దీంతో అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా సందిగ్ధంలో మునిగిపోయారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకునే ఓ న్యూస్ నెట్టింట ప్రత్యక్షమైంది.

అందుతున్న సమాచారం మేరకు.. ‘రాజాసాబ్’ టీజ‌ర్ (Teaser) రెడీ అయిందట. ఇంకా ప్రభాస్ డ‌బ్బింగ్ ఒక్కటే బాకీ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం డార్లింగ్ విదేశాల్లో ఉండగా.. అక్కడ నుంచి తిరిగి రాగానే డ‌బ్బింగ్ పూర్తి చేసి, రిలీజ్ డేట్ ప్రక‌టిస్తారని టాక్. ద‌ర్శకుడు మారుతి క‌ట్ చేసిన‌ టీజ‌ర్ మాత్రం.. ఓ రేంజ్‌లో ఉంటుందని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా టీజర్ వచ్చిన తర్వాత క‌నీసం ఓ వారం రోజులు అయినా.. ఈ టీజ‌ర్ గురించే మాట్లాడుకొంటారని సోషల్ మీడియా(Social media)లో ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటుగా సోష‌ల్ మీడియాలో ఎప్పటికీ మార్మోగిపోయే డైలాగ్ ఒక‌టి ప్రభాస్ నుంచి ఉంటుందని వార్తలు రాగా.. ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు.

Next Story