- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhas: ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ పోస్టర్ రిలీజ్.. బిగ్ సర్‌ప్రైజ్ రాబోతుందంటూ హైప్ పెంచుతున్న ట్వీట్
మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కన్నప్ప’(Kannappa). దీని కోసం ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

దిశ, సినిమా: మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కన్నప్ప’(Kannappa). దీని కోసం ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాను ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీని ఎవా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు(Mohan Babu) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), శరత్ కుమార్, మోహన్ లాల్(Mohanlal), వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్(Akshay Kumar) శివుడిగా నటిస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. అయితే ‘కన్నప్ప’ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇక ఇందులోంచి వచ్చిన ప్రతి అప్డేట్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు క్యూరియాసిటీని పెంచాయి. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నాడని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అవి చూసిన వారంతా శివుడిగా నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ ఆ రోల్ అక్షయ్ చేస్తున్నాడని తెలుసుకుని ప్రేక్షకులు డైలమాలో పడిపోయారు.
ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రభాస్(Prabhas) నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ఆఫ్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన విభూతిని నామాలుగా పెట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు. కానీ ఫుల్ పోస్టర్‌ను, డార్లింగ్‌కు సంబంధించిన గ్లింప్స్(Glimpse)ను మాత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక అది చూసిన వారంతా ఫుల్ ఖుషీ అవుతూ గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు.
Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8
— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025






