- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవితో సినిమా చేయాలనేది నా కోరిక.. మనసులో మాట బయటపెట్టిన ప్రభాస్ డైరెక్టర్
కల్కీ సినిమా(Kalki movie)తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin).

దిశ, వెబ్‌డెస్క్: కల్కీ సినిమా(Kalki movie)తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin). దీనికి ముందే మహానటి సినిమాతో తన సత్తా ఏంటో చూపించినా.. అది తెలుగు సహా రెండు మూడు లాంగ్వేజెస్ వరకే పరిమితం అయ్యింది. కల్కీ సినిమా దాదాపు పది భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. అన్ని భాషల్లో కలుపుకొని ఆ చిత్రం ఏకంగా రూ.1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నాగ్ అశ్విన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగ్ అశ్విన్ మనసులోని మాట బయటపెట్టారు. బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మానందం’ అనే సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చిరంజీవితో పాటు ఈ ఫంక్షన్‌కు హాజరైన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు నా అభిమాన హీరో. ఆయన్ను చూసే సినిమాల్లోకి వచ్చాను. ఆ సినిమాలు చూస్తూ ఎన్నో సార్లు చొక్కాలు చింపుకున్నారు. ఇవాళ ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానందం గారితో ఒకటి, రెండు సినిమాలు చేశాను. భవిష్యత్‌లో కూడా మళ్లీ చేస్తాననే నమ్మకం ఉంది. కానీ చిరంజీవి గారితో ఇంతవరకు సినిమా చేయలేదు. ఆయనతో సినిమా చేయాలని ప్రతీ డైరెక్టర్‌కు ఉంటుంది. వారి లాగే చిరంజీవి గారితో సినిమా చేయడం నా కల. అది ఎప్పుడు నెరవేరుతుందా? అని చాలా ఈగర్‌గా ఎదురుచూస్తున్నాను. ఆయన సినిమాల్లో చంటబ్బాయి, ఆపద్బాందవుడు నా ఫేవరేట్ సినిమాలు’ అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఆ వెనకాలే ఉన్న చిరంజీవి.. నాగ్ అశ్విన్ మాటకు చిన్న చిరునవ్వు నవ్వారు.






