- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhas: ప్రభాస్ అనుకున్నంత సైలెంట్ కాదు.. నిజాలు బయటపెడుతూ యంగ్ హీరోయిన్ షాకింగ్ ట్వీట్..
కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘పట్టం పోల్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘పేట’ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక గత ఏడాది ‘తంగలాన్’(Thangalan) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో అమ్మడుకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మాళవిక మోహనన్ ‘ది రాజాసాబ్’(The Rajasaab) హృదయ పూర్వం, సర్దార్-2 వంటి చిత్రాల్లో నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూడు ప్రాజెక్ట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక మాళవిక మోహనన్ షూటింగ్స్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా, ట్విట్టర్ ద్వారా ఈ భామ అభిమానులతో ముచ్చటించింది. ఇక ఇందులో వారు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ ‘ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం మాకు చెప్పండి’ అని అడగ్గా.. దానికి మాళవిక స్పందిస్తూ.. ‘‘నేను ప్రభాస్ సర్ ని కలవడానికి ముందు ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు చాలా సైలెంట్‌గా ఉంటారని అనుకున్నాను. అలాగే రిజర్వ్ గా ఉంటారోమో అని ఊహించాను. కానీ ఆయనను స్వయంగా కలిసినప్పుడు అద్భుతమైన సంభాషణకర్త, సూపర్ ఫన్, ఫన్నీ అని అర్థమైంది. ఆయనతో సమయం గడపడానికి చాలా చక్కని వ్యక్తులలో ఒకరు! ఆయన చుట్టూ ఎప్పుడూ బోరింగ్ క్షణమే లేదు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ప్రభాస్ అంత ఫన్నీగా ఉంటారా? అని ఆశ్చర్యపోతున్నారు.






