- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ప్రభాస్.. ‘కల్కి’, ‘స్పిరిట్’లను అలా మేనేజ్ చేస్తున్నాడు
ప్రభాస్ మే 4 నుండి 7 వరకు ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత మే 10 నుండి ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్‌లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Prabhas latest Looks goes viral
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరికొన్ని సినిమాలను ప్రారంభించి జెట్ స్పీడ్‌లో పూర్తి చేసే వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. ఈయన ఏకకాలంలో రెండు, మూడు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’, ‘కల్కి 2’ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన రాబోయే షూటింగ్ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయో చూస్తే... ‘కల్కి 2’ మూవీకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున ప్రభాస్ కూడా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. మే 7 వరకు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. అలా నాలుగు రోజుల పాటు ‘కల్కి 2’ షూటింగ్ పూర్తి చేసిన అనంతరం, మూడు రోజుల విరామం తీసుకుని మే 10 నుంచి ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ఇలా పక్కా ప్లానింగ్‌తో ప్రభాస్ తన షూటింగ్ షెడ్యూల్స్‌ను మేనేజ్ చేస్తూ ఒకేసారి పలు ప్రాజెక్ట్‌లను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.






