సందీప్ రెడ్డికి షాక్‌..ఆ సినిమాపై ప్ర‌భాస్ ఫోకస్ ?

by velandi.Saikiran |   (  Updated:2026-01-29 11:28:47  IST  )

స్పిరిట్ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్, ఇప్పుడు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సందీప్ రెడ్డికి షాక్‌..ఆ సినిమాపై ప్ర‌భాస్ ఫోకస్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు ప్రభాస్. మొన్న సంక్రాంతికి ది రాజా సాబ్ సినిమాతో మెరిశారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. నష్టాలనే మిగిల్చిన‌ట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రభాస్ ఫోకస్ చేశాడు. ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట ప్రభాస్. ఈ మూవీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా భారీ యాక్షన్ నేపథ్యంలో వస్తోంది.

స్పిరిట్ సినిమా పక్కకు.. ప్రభాస్ షాకింగ్ నిర్ణయం ?

స్పిరిట్ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్, ఇప్పుడు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటే, ముందు హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఫౌజీ సినిమా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట ప్రభాస్. ఈ మూవీని 2026 దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారట. దీంతో స్పిరిట్ కంటే ముందు ఈ ఫౌజీ సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే స్పిరిట్ షూటింగ్ ఆపేసి, ఫౌజీ ఫినిష్ చేయాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్పిరిట్ మిగతా పార్ట్ షూటింగ్ షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. స్పిరిట్ సినిమా 2027 మార్చి 5వ తేదీన రిలీజ్ కానుంది. అందుకే ముందుగా ఫౌజీ పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

Similar News : సందీప్ రెడ్డికి షాక్‌..ఆ సినిమాపై ప్ర‌భాస్ ఫోకస్ ?

Next Story