Prabhas: ‘కన్నప్ప’ మూవీలో ప్రభాస్ ఇంట్రో సాంగ్.. అసలు మ్యాటర్ లీక్ చేసిన కమెడియన్ (వీడియో)

by Hamsa |   ( Updated:2025-01-24 04:19:56.0  )
Prabhas: ‘కన్నప్ప’ మూవీలో ప్రభాస్ ఇంట్రో సాంగ్.. అసలు మ్యాటర్ లీక్ చేసిన కమెడియన్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు(Mohan Babu) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్, కాజల్, ప్రభాస్(Prabhas), శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ఐశ్వర్య వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే కన్నప్ప నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అంచనాలను రెట్టింపు చేయడంతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తున్నట్లు రివీల్ చేసి హైప్ పెంచేశారు. అయితే ఈ క్యారెక్టర్‌లో ప్రభాస్(Prabhas) నటిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ అక్షయ్ పోస్టర్ విడుదల చేయడంతో అంతా షాక్‌లో ఉండిపోయారు.

మరి ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నాడో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(Hyper Adhi) ఓ హింట్ ఇచ్చాడు. కన్నప్పలో ప్రభాస్‌(Prabhas)కి ఇంట్రో సాంగ్ ఉంటుందని దానికి గణేష్ మాస్టర్(ganesh Master) కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో డార్లింగ్ ఎవరూ ఊహించని క్యారెక్టర్‌లో చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల నిడివి ఉండబోతుందని టాక్.

Advertisement

Next Story