రాజా సాబ్ : జోకర్ గెటప్‌లో రెబల్ స్టార్

by Sujitha Rachapalli |

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాజా సాబ్’ సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 9న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. రీసెంట్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌తో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్

రాజా సాబ్ : జోకర్ గెటప్‌లో రెబల్ స్టార్
X

దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాజా సాబ్’ సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 9న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. రీసెంట్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌తో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు మేకర్స్, ఫ్యాన్స్. ఇక ప్రమోషన్స్‌లో రేపు రిలీజ్ ట్రైలర్ రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న మూవీకి సంబంధించిన ట్రైలర్ అన్ని భాషల్లో రెడీ అయిపోగా.. హిందీ కోసం వెయిట్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ ట్రైలర్‌ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. ఇందులో ప్రభాస్ ‘జోకర్’ గెటప్‌లో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో రెబల్స్ ఎగ్జయిట్ అయిపోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ మారుతి.. సినిమాలో ఒక్క నిమిషం బోర్ కొట్టినా నన్ను ఇంటికి వచ్చి కొట్టండని అడ్రస్ కూడా ఇవ్వగా.. సినిమా సక్సెస్‌పై ఆయనకున్న ధీమా ఏంటో చెప్పేస్తుంది.

Next Story