- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాయంతో కనిపించిన ప్రభాస్ హీరోయిన్.. ఏమైందంటూ ఆందోళనలో చెందుతున్న అభిమానులు
టాలీవుడ్ బ్యూటీ అన్షు అంబాని(Anshu Ambani) ‘మన్మథుడు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీతోనే హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ అన్షు అంబాని(Anshu Ambani) ‘మన్మథుడు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీతోనే హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇందులో నాగార్జున(Nagarjuna) హీరోగా నటించగా.. 2002లో వచ్చి హిట్ సాధించింది. ఆ తర్వాత ఈ అమ్మడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాఘవేంద్ర’(Raghavendra) చిత్రంలో హీరోయిన్’గా చాన్స్ దక్కించుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. అలాగే మిస్సమ్మ, జై వంటి సినిమాలతో మెప్పించిన ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. పూర్తిగా ఇండస్ట్రీకి, సోషల్ మీడియాలో దూరంగా ఉంటూ ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటుంది. ఇప్పుడు మళ్లీ 22 ఏళ్ల తర్వాత అన్షు అంబాని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ‘మాజాకా’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.
అయితే ఇందులో రితూ వర్మ(Rithu Verma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేష్ ప్రధాన పాత్రలో మెప్పించనున్నారు. స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinath Rao Nakkina) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 26ప ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మాజాకా’ (Mazaka)ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో అన్షు తలకు గాయంతో కనిపించింది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇక అవి చూసిన నెటిజన్లు అన్షుకు షూటింగ్‌లో గాయం అయిందా? లేక ఇంట్లోనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.






