అతనితో ప్రభాస్ హీరోయిన్ డేటింగ్.. హార్ట్ సింబల్‌తో ఆ ఫొటో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసిందిగా!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ఇటీవల ‘స్త్రీ-2’(Stree-2) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అతనితో ప్రభాస్ హీరోయిన్ డేటింగ్.. హార్ట్ సింబల్‌తో ఆ ఫొటో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసిందిగా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ఇటీవల ‘స్త్రీ-2’(Stree-2) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది. శ్రద్ధా స్క్రీన్ రైటర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీ(Rahul Modi)తో సహజీవనం చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె రాహుల్‌తో ఉన్న ఫొటో షేర్ చేసింది. అలాగే చాటుమాటుగా తనతో కలిసి షికార్లు కొడుతూ పలు సార్లు కెమెరాకు చిక్కింది.

కానీ తన ప్రేమ గురించి మాత్రం పెదవి విప్పడానికి నిరాకరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రద్ధా మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియుడు రాహుల్ మోడీతో ముద్దు ముచ్చట తీర్చుకుంటూ ఓ ఫొటోను సోషల్ మీడియా(Social media)లో షేర్ చేసింది. సేమ్ కలర్ ప్రింటెడ్ డ్రెస్ ధరించి నిల్చున్న పిక్ నెట్టింట పెట్టింది. అంతేకాకుండా ఓ రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా షేర్ చేసింది. దీంతో వీరిద్దరు నిజంగా సహజీవనం చేస్తున్నారని అందుకే ఆ హార్ట్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం శ్రద్ధా పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Next Story