అతనితో డేటింగ్ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయిందిగా! (వీడియో)

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) నటుడు శక్తి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

అతనితో డేటింగ్ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయిందిగా! (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) నటుడు శక్తి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘ఎక్ విలన్’(Ek Villain) మూవీతో వచ్చి అషికి-2, భాఘీ వంటి మూవీస్‌తో హిట్స్ అందుకుని తన క్రేజ్‌ను పెంచుకుంది. ఇక తెలుగులో ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘సాహో’ మూవీలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్లా కొట్టింది. శ్రద్ధా కపూర్ గత ఏడాది ‘స్త్రీ-2’ చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది రోజుల నుంచి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీ(Rahul Modi)తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పలు వేడుకలు, వెకేషన్స్‌కు వెళ్తూ మీడియా కంట పడుతున్నారు.

అయితే ఇటీవల శ్రద్ధా కపూర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ పెళ్లికి కూడా హాజరైంది. కానీ డేటింగ్ వార్తపై మాత్రం రియాక్ట్ కావడంతో లేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా, శ్రద్ధా ముంబూలోని ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఈక్రమంలోనే మీడియా కంట పడటంతో ఫొటోలు తీస్తుండగా.. తన ఫోన్ ఆన్ చేసి ఏదో చూసుకున్నట్లు చేసింది. అందులో మేడీతో కలిసి తీసుకున్న ఫొటో వావ్‌పేపర్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా అడ్డంగా దొరికిపోయింది కాస్త చూసుకోవచ్చుగా అని అంటున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి చేసుకోవడం ఖాయం అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story