- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhas: షూటింగులో గాయపడిన హీరో ప్రభాస్!
ఫౌజీ సినిమా షూటింగ్ సందర్భంగా Hero ప్రభాస్ కు తీవ్ర గాయం అయింది.

Prabhas Injured on Fauzi Sets
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు ప్రభాస్. అయితే అలాంటి ప్రభాస్ అభిమానులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ తాజాగా గాయపడినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఫౌజీ మూవీ ( Prabhas Fauzi ) షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్ కు ( prabhas injury) గాయమైనట్లు చెబుతున్నారు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ కు గాయం
సంక్రాంతి కానుకగా రాజా సాబ్ సినిమాతో మెరిసిన ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హార్స్ రైడ్ చేశారట. ఈ తరుణంలోనే ప్రభాస్ కు గాయం అయినట్లు సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హార్స్ రైడ్ చేస్తుండగా ప్రభాస్ కింద పడిపోయారట. దీంతో అతని చేతులకు గాయాలైనట్లు సమాచారం. అనంతరం అలర్ట్ అయిన చిత్ర బృంద సభ్యులు వెంటనే, ప్రభాస్ కు ప్రథమ చికిత్స అందించారట. అయితే గాయాలు పెద్దవి కాకపోవడంతో ఒకటి లేదా రెండు రోజుల పాటు ప్రభాస్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఎప్పటి లాగే రెండు రోజుల్లో ప్రభాస్ షూటింగులో పాల్గొంటారని టాక్ నడుస్తోంది. కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ ఫౌజీ సినిమా వస్తోంది. స్పిరిట్ కంటే ముందే ఈ ఫౌజీ రానుంది. అందుకే ప్రభాస్ దూకుడుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు.






