ప్రభాస్-హను రాఘవపూడి సినిమా టైటిల్ ఫిక్స్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-23 06:43:41  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమా నుండి కీలక అప్డేట్ వచ్చింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ పేరు ఫౌజీగా ప్రకటించారు.

ప్రభాస్-హను రాఘవపూడి సినిమా టైటిల్ ఫిక్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమా నుండి కీలక అప్డేట్ వచ్చింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ పేరు ఫౌజీగా ప్రకటించారు. చాలా కాలం నుండి ఫౌజీనే టైటిల్ అని ప్రచారం జరుగుతుండగా చిత్రయూనిట్ దాన్నే ఫైనల్ చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా పాన్ ఇండియా లెవ‌ల్ లో దీనిని తెర‌కెక్కిస్తున్నారు.

పోస్ట‌ర్ లో ప్ర‌భాస్ ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా ఎ బెటాలియ‌న్ హూ ఫైట్స్ ఎలోన్ అంటూ పోస్ట‌ర్ కు క్యాప్ష‌న్ ఇచ్చారు. అంతేకాకుండా పోస్టులో ప‌ద్మ‌వ్యూహాన్ని జ‌యించిన ప‌ద్మ‌వ్యూహ విజ‌యీ పార్థః అనే సంస్కృత శ్లోకాన్ని పేర్కొన్నారు. శ్లోకం అర్థం.. ప‌ద్మ‌వ్యూహాన్ని జ‌యించిన అర్జునుడు, పాండ‌వుల ప‌క్షాన నిలిచిన క‌ర్ణుడు, గురువు లేని ఏక ల‌వ్యుడు అని అర్థం వ‌స్తుంది. దీంతో పాటు మ‌న చ‌రిత్ర‌లో దాగిన ధైర్య‌వంతుడైన సైనికుడి క‌థ ఇది అని పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా ఓ సైనికుడి క‌థ అని అర్థం అవుతుంది.

READ MORE ...

గీతా ఆర్ట్స్‌తో ప్రభాస్ నెక్స్ట్.. బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్!

Next Story