ఒక్క అప్డేట్‌తో ఐదు సినిమాల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభాస్

by Pulgam srinivas |

బాలయ్య, చిరు, చైతూ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలు కూడా డిసెంబర్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

ఒక్క అప్డేట్‌తో ఐదు సినిమాల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది డిసెంబర్ నెలలో అనేక భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో డిసెంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఇతర చిత్రాల పరిస్థితి ఏంటనే చర్చలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో తెలుగు చిత్రాలతో పాటు పలు హిందీ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో 'ఎన్‌బీకే 111' వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న చిత్రాన్ని దసరా లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే చిరంజీవి - బాబీ కొల్లి కాంబినేషన్‌లో 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రాన్ని కూడా డిసెంబర్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వృషకర్మ' చిత్రాన్ని కూడా డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'రేంజర్', అలాగే అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న మరో హిందీ చిత్రం కూడా డిసెంబర్ విడుదలకే సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ 'ఫౌజీ' అదే నెలలో విడుదల కానుండటంతో మిగతా చిత్రాల విడుదల తేదీలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో డిసెంబర్ బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story