Prabhas: రెబల్ ర్యాంపేజ్.. బర్త్‌డే స్పెషల్ అప్డేట్స్.. ఫౌజీలో ఆ బ్యూటీ ఫిక్స్

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. నెట్టింట సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి.

Prabhas: రెబల్ ర్యాంపేజ్.. బర్త్‌డే స్పెషల్ అప్డేట్స్.. ఫౌజీలో ఆ బ్యూటీ ఫిక్స్
X

దిశ‌, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. నెట్టింట సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సెలబ్రిటీల దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టర్లు షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా పోటాపోటీగా రెబల్ స్టార్ నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు మరింత ఖుష్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమా నుండి కీలక అప్డేట్ వచ్చింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ పేరు ఫౌజీగా ప్రకటించారు.

చాలా కాలం నుండి ఫౌజీనే టైటిల్ అని ప్రచారం జరుగుతుండగా చిత్రయూనిట్ దాన్నే ఫైనల్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా పాన్ ఇండియా లెవ‌ల్‌లో దీనిని తెర‌కెక్కిస్తున్నారు. పోస్టర్‌లో ప్రభాస్ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా ‘ఎ బెటాలియ‌న్ హూ ఫైట్స్ ఎలోన్’ అంటూ షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. అలాగే ప్రభాస్ వరుస ప్రాజెక్టులలో ‘ది రాజాసాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ కాబోతుండగా.. అందులో నుంచి కూడా డార్లింగ్ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు చిత్ర బృందం.

ప్రజెంట్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ప్రభాస్ ‘ఫౌజీ’కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. ఇందులో ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ చైత్ర ఆచార్ ఓ కీలక రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈమె ఫైనల్ కాగా.. త్వరలో దీనిపై కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్. లింక్

Next Story