- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhas Birthday Special: ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ స్టార్ట్.. ది రాజాసాబ్ నుంచి మరో పోస్టర్ వదిలిన టీమ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో ‘ది రాజాసాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌కు నెట్టింట సూపర్ రెస్పా్న్స్ రావడంతో.. ఈ మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన రాజాసాబ్ చిత్ర బృందం.. ‘ది రాజాసాబ్’ మూవీ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్‌లో చూపించిన హైలెట్ సీన్‌కు సంబంధించిన ఈ పోస్టర్ ప్రజెంట్ నెట్టింట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో డార్లింగ్ రాయల్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, ఇషన్ సక్సేనా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్‌లు కాగా.. సంజయ్ దత్, అనుపమ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘ది రాజాసాబ్’ హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య 2026 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. లింక్






