Prabhas: మీరు ఒక అద్భుతమైన వ్యక్తి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన ప్రభాస్

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) త్వరలో ‘కన్నప్ప’ (Kannappa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Prabhas: మీరు ఒక అద్భుతమైన వ్యక్తి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన ప్రభాస్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) త్వరలో ‘కన్నప్ప’ (Kannappa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ (Guest role) అయినప్పటికీ డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ మెయిన్ ప్రాజెక్టల విషయానికి వస్తే.. ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘సలార్-2’, ‘కల్కి-2’ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజెంట్ ఈ స్టార్ హీరో గ్యాప్ లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేశాడు.

‘కల్కి’ (Kalki) డైరెక్టర్ నాగ అశ్విన్ (Naga Ashwin) బర్త్‌డే కావడంతో.. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘మీరు ఒక అద్భుతమైన వ్యక్తి.. మీ డెడికేషన్, కమిట్మెంట్ ఎప్పుడు నాకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాయి. నేను ‘కల్కి-2’ మ్యాజిక్‌ను చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను.. చాలా ఎగ్జైటింగ్‌(Exciting)గా ఉంది.. ప్రేమతో మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ప్రభాస్ పోస్ట్ వైరల్ కావడంతో.. మేము కూడా కల్కి-2 కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. నాగఅశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు కలెక్షన్స్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాకుండా.. ఈ సినిమా లాస్ట్‌లో కల్కి పార్ట్ 2 (Kalki Part 2) కూడా ఉందని అనౌన్స్ చెయ్యడంతో.. పార్ట్ 2 కోసం సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Next Story