- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిట్ మూవీ సీక్వెల్‌లో రణ్‌వీర్ సింగ్‌తో రొమాన్స్ చేయబోతున్న ప్రభాస్ బ్యూటీ.. హైప్ పెంచుతున్న ట్వీట్!
ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) దర్శకత్వంలో వచ్చిన ‘డాన్’ సినిమా ప్రేక్షకులను ఆదరించడంతో పాటు హిట్ అందుకుంది.

దిశ, సినిమా: ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) దర్శకత్వంలో వచ్చిన ‘డాన్’ సినిమా ప్రేక్షకులను ఆదరించడంతో పాటు హిట్ అందుకుంది. షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), ప్రియాంక చోప్రా(Priyanka Chopra) జంటగా నటించిన ఈ చిత్రం 2006లో థియేటర్స్‌లోకి వచ్చి బాక్సాఫీసు వద్ద లాభాలు రాబట్టింది. దీంతో ఫర్హాన్ ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించారు. 2011లో వచ్చిన ‘డాన్-2’ కూడా విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ దీనికి సీక్వెల్ తీసుకురాబోతున్నారు. ‘డాన్-3’ రాబోతున్నట్లు ప్రకటించారు కానీ నటీనటుల గురించి వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘డాన్-3’ సినిమాలో హీరో, హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), కృతి సనన్(Kriti Sanon) జంటగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రారంభం కానున్నట్లు టాక్. అయితే ఈ చిత్రం కోసం ముందుగా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నప్పటికీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మూవీ మేకర్స్ కృతి సనన్ అయితే బాగుంటుందని ఆమె సంప్రదించగా.. స్టోరీ విన్న ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
EXCLUSIVE: #KritiSanon frontrunner for #Don3 with #RanveerSingh; #FarhanAkhtar gears up for third chapter of #Don from October/November 2025 - Detailed Report!https://t.co/yTNHB02tup
— Himesh (@HimeshMankad) April 22, 2025






