- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్చర్స్ ఆఫ్ ది ల్యాండ్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. అలాగే తన నటనతో కూడా బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth) సరసన ‘పేట’(Peta) మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా వచ్చిన అన్ని చిత్రాల్లో నటించింది.
ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ స్టార్ హీరో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే రీసెంట్‌గా ‘తంగలాన్’(Thangalan) సినిమాతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు ప్రభాస్‌తో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్(Riddi Kumar)లు కూడా రొమాన్స్ చేయబోతున్నారు.
సంజయ్ దత్(Sanjay Dutt), అనుపమ్ ఖేర్(anupam Kher) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తున్న యంగ్ బ్యూటీ మాళవిక.. తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో నేచర్ ఫొటోస్‌తో పాటు ఈ భామను బైక్ సైడ్ నుంచి తీసిన పిక్ కూడా అభిమానులతో పంచుకుంది. ఇక వీటికి ‘టెక్చర్స్ ఆఫ్ ది ల్యాండ్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ నేచర్ విత్ మాళవిక బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






