- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఆధార్ కార్డు వైరల్.. ఫొటో చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్..
సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా అభిమానులకు ఏ చిన్న విషయం తెలిసినా చాలా సంతోషంగా ఉంటుంది. వారి పూర్తి పేరు నుంచి ఎలా పెరిగారు? ఎక్కడ చదివారు?

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా అభిమానులకు ఏ చిన్న విషయం తెలిసినా చాలా సంతోషంగా ఉంటుంది. వారి పూర్తి పేరు నుంచి ఎలా పెరిగారు? ఎక్కడ చదివారు? క్రష్, లవ్ వగైరా వగైరా అన్ని తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆయన ఆధార్ కార్డు దొరకడంతో పండుగ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆయన ఫుల్ నేమ్, ఫొటో, ఆధార్ నంబర్, వయసు.. చూసి మురిసిపోతున్నారు. మరోవైపు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పర్సనల్ విషయాలు లీక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తుంటే.. ఏ ఫోన్ నంబర్ లింక్ చేయలేదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. థాంక్ గాడ్ ఆధార్‌లో ప్రభాస్ కూడా బాలేడు.. ఇన్నాళ్లు బాధపడే వాడిని కానీ ఇప్పుడు ఆయన కూడా బాగాలేడని తెలుసుకుని సంతోషపడుతున్నా అని కామెంట్స్ చేస్తున్నారు.






