- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగచైతన్య NC24పై పవర్ ఫుల్ అప్‌డేట్.. ఆ సినిమాను మించి ఉంటుందంటూ పోస్ట్
అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ (Thandel). అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ‘తండేల్’పై భారీ హైప్‌ను క్రియేట్ చెయ్యగా.. ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఫిబ్రవరి-7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. ఇంకా నాగచైతన్య ‘తండేల్’ రిలీజ్ కాకముందే.. ఈ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది.
నాగచైతన్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘NC24’ను ‘విరుపాక్ష(Virupaksha)’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik dandu)తో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో పాటు.. షూటింగ్ లాంచనాలతో మూవీ స్టార్ట్ అయినట్లు సమాచారం. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాకు ‘వృషకర్మ’ (Vruskarma) అనే ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుంది. నాగ చైతన్య & కార్తీక్ దండు సినిమా ‘NC24’ విరూపాక్ష కంటే పెద్దది & బెటర్‌గా ఉండనుందట. అంతే కాకుండా హాలీవుడ్ స్టాండర్డ్‌తో సమానంగా ఈ సినిమా రూపొందనుందని, స్క్రిప్ట్‌కు యూనివర్స్ ఆదరణ లభిస్తుందని ఆర్ట్ డైరెక్టర్ టి.నాగేంద్రప్రసాద్ (Art Director T. Nagendraprasad) తెలిపారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు నెటిజన్లు.






