విజయ్ దేవరకొండ ‘వీడీ-14‌’కు పవర్ ఫుల్ టైటిల్..?

by I. Sairam |   (  Updated:2026-01-21 08:12:50  IST  )

హీరో విజయ్ దేవరకొండ, (Vijay Devarakonda) డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్(Rahul Sankruthyan) ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “వీడీ 14”.

విజయ్ దేవరకొండ ‘వీడీ-14‌’కు పవర్ ఫుల్ టైటిల్..?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో విజయ్ దేవరకొండ, (Vijay Devarakonda) డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్(Rahul Sankruthyan) ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “వీడీ 14”. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో సినిమా టైటిల్‌కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. విజయ్ దేవరకొండ VD-14కి "రణభేరి" (Ranabheri) మరియు "ది గన్" (The Gun) అనే పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయట. మరి ఇందులో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రెజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

VD14: విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమాపై బిగ్ అప్డేట్‌

Next Story